దుమారం రేపుతున్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు!
Add ap7am to your home Screen

దుమారం రేపుతున్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలు!

  • ఎదగాలంటే చదువుతో పనిలేదు
  • పూలన్ దేవి ఏం చదువుకుంది?
  • బందిపోటు దొంగ నుంచి రాజకీయ నాయకురాలు అయింది!
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు ఛాయా వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో యూత్ కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. జీవితంలో చదువుకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన పనేమీ లేదన్నారు. ఎటువంటి చదువులు చదువుకోకపోయినా దొంగ నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగిన పూలన్ దేవిని ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు.

‘‘పూలన్ దేవినే తీసుకోండి.. ఆమె ఏం చదువుకుంది. బందిపోటు దొంగ నుంచి రాజకీయ నేతగా ఎదిగింది. చాలా పేరు సంపాదించుకుంది. కాబట్టి గుర్తింపు కోసం స్వీయ డిగ్రీలు ఉండాల్సిన పనిలేదు’’ అని ఆమె పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి, అక్షరాస్యత పెంపునకు ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుంటే.. ఛాయావర్మ ఏకంగా చదువే అక్కర్లేదని చెప్పడంపై విమర్శల జడివాన కురుస్తోంది. ఎంపీగా ఉండి ఇలాంటి బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు.
Congress
MP
Chhaya verma
phoolan devi
Education

More Telugu News