New Delhi: రెస్టారెంట్ లోని మహిళల బాత్రూంలో నగ్న వీడియోల చిత్రీకరణ.. షాకైన అతిథి!

షార్ట్స్‌లో చూడండి
హోటల్‌లో ఉన్న మహిళల టాయ్‌లెట్‌లో సెల్‌ఫోన్‌తో అశ్లీల చిత్రాలు చిత్రీకరిస్తున్న గుట్టు రట్టయింది. బాత్రూంకి వెళ్లిన ఓ మహిళకు వీడియో తీస్తున్నారన్న అనుమానం వచ్చి చూడగా నిజమని తేలడంతో షాక్‌కు గురయింది. న్యూఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ ప్రాంతంలోని ఓ  హోటల్‌లో ఈ సంఘటన వెలుగు చూసింది.

సదరు రెస్టారెంట్ కి వచ్చిన ఓ మహిళ బాత్రూంకు వెళ్లింది. గదిలో ఓ చోట మొబైల్‌ ఫోన్‌ ఉండడం గమనించింది. వీడియో తీస్తున్నారేమోనన్న అనుమానంతో పరిశీలించగా నిజమని తేలింది. అందులో చాలా మంది నగ్న వీడియోలు ఉండడం, కొన్ని వాట్సాప్‌లో షేర్‌ చేసి ఉండడంతో ఆమె షాక్‌కు గురైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కూపీలాగగా హోటల్‌లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న ఓ కార్మికుడి నిర్వాకంగా గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. నిందితుడితోపాటు హోటల్‌ యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Go Back to Shorts
New Delhi
Kannatplace
Hotel

More Telugu News