ballari: భార్య గొంతుకోసి హత్య.. ఆస్తి వివాదం నేపథ్యంలో ఓ భర్త ఘాతుకం

షార్ట్స్‌లో చూడండి
ఆస్తి కోసం భార్యతో ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఆమె గొంతుకోసి హత్య చేశాడో భర్త. అనంతరం పురుగుల మందుతాగి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. బళ్లారి తాలూకా ఇబ్రహింపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలాలివి. గ్రామానికి చెందిన బసప్ప (55)కు, తగ్గినబూదిహళ్‌ గ్రామానికి చెందిన పార్వతమ్మ (50)తో ముప్పై ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఐదుగురు పిల్లలున్నారు.

ఇటీవల దంపతుల మధ్య ఆస్తికోసం గొడవ మొదలయింది. భర్తతో విభేదించిన పార్వతమ్మ అతన్ని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్నాళ్లుగా అక్కడే ఉంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం బసప్ప భార్య ఉంటున్న తగ్గినబూదిహళ్‌ గ్రామానికి చేరుకున్నాడు. ఇంటిలో నిద్రిస్తున్న ఆమె గొంతుకోసి చంపేశాడు. అనంతరం గ్రామ శివారులోని రైల్వేపట్టాల వద్దకు చేరుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Go Back to Shorts
ballari
murder

More Telugu News