టీఎస్ ఎలక్షన్స్... అక్టోబర్ 10 లేదా 12న నోటిఫికేషన్, నవంబర్ 15 నుంచి 20 మధ్య పోలింగ్!
- నవంబర్ 15 నుంచి 20 మధ్య అసెంబ్లీ ఎన్నికలు
- వచ్చే నెల 10 నుంచి 12 మధ్య షెడ్యూల్
- షెడ్యూల్ పై కసరత్తు ప్రారంభించిన ఎన్నికల కమిషన్
తెలంగాణలో ఓటర్ల తుది జాబితా వచ్చే నెల 8న విడుదల కానుండగా, ఆ వెంటనే రెండుమూడు రోజుల్లో అంటే అక్టోబర్ 10 లేదా 12న ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి వెల్లడించారు. ఆపై పది రోజుల వ్యవధిలో నామినేషన్ల ప్రక్రియ ముగించి, రెండు వారాల వ్యవధిలో అంటే, నవంబర్ 15 నుంచి 20 మధ్య పోలింగ్ నిర్వహించవచ్చని ఆయన అన్నారు.
ఇప్పటికే పోలింగ్ ఏర్పాట్లు, శాంతిభద్రతలపై నివేదికలు తెప్పించుకుంటున్న ఎన్నికల సంఘం, తదుపరి అడుగులను శరవేగంగా వేస్తోంది. ఇక ఏవైనా అనుకోని పరిస్థితుల్లో ఆ నాలుగు రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తే, నవంబర్ చివరి వరకూ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం లేదు.