ప్రణయ్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటే.. నిరసనకు దిగుతా!: హెచ్చరించిన అమృత
- కుల హత్యలకు హెచ్చరికగానే ప్రణయ్ విగ్రహం
- అడ్డుకునేందుకు మా నాన్న అనుచరులు ట్రై చేస్తున్నారు
- అనుమతుల కోసం అధికారులను కలుస్తానన్న అమృత
తనకు జరిగిన అన్యాయాన్ని అందరికీ తెలియజేసేందుకు, భవిష్యత్ లో కుల హత్యలు జరగకుండా హెచ్చరించాలన్న ఉద్దేశంతో ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నామని అమృత తెలిపింది. ఈ విగ్రహ ఏర్పాటు పనులను తన తండ్రి మారుతీరావు అనుచరులు అడ్డుకుంటున్నారని వెల్లడించింది. త్వరలోనే ఈ విషయమై అధికారులను సంప్రదించి అనుమతులు కోరతానని చెప్పింది. అడ్డంకులు ఎదురైతే విగ్రహ ఏర్పాటు స్థలంలోనే నిరసనకు దిగుతానని హెచ్చరించింది.