'సాహో' సినిమా గురించి ఫిల్మ్ నగర్ టాక్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' సినిమా గురించి ఫిల్మ్ నగర్ టాక్!

  • సుజిత్ దర్శకత్వంలో 'సాహో'
  • తదుపరి షెడ్యూల్ ముంబైలో 
  • టీజర్ కోసం ఫాన్స్ ఎదురుచూపులు
సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. దుబాయ్ షెడ్యూల్ పూర్తయిన తరువాత, హైదరాబాద్ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను ముంబయిలో ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ ఇంతవరకూ మొదలుకాకపోవడం పట్ల అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ షెడ్యూల్ ఆలస్యం అవుతుండటానికి కారణం, స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తుండటమేననే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ముంబయిలో చిత్రీకరించవలసిన కొన్ని సీన్స్ గురించి తెలుసుకున్న ప్రభాస్, అక్కడక్కడా కొన్ని మార్పులు, చేర్పులు చెప్పాడట. దాంతో సుజిత్ వాటిని సరిచేసే పనిలో వున్నాడని అంటున్నారు. ప్రభాస్ ఆశించినట్టుగా ఆ సీన్స్ వచ్చినప్పుడే ఈ షెడ్యూల్ మొదలవుతుందట. దసరాకి ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభాస్ అభిమానులు వున్నారు.   
prabhas
shraddha kapoor

More Telugu News