spice jet: బ్యాంకాక్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త.. హైదరాబాద్ నుంచి నేరుగా సర్వీసులు ప్రారంభించిన స్పైస్‌జెట్

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ వెళ్లాలనుకునే ప్రయాణికులకు ప్రైవేటు రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ శుభవార్త చెప్పింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ఫలితంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చిన తొలి దేశీయ విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది. అలాగే, హైదరాబాద్ నుంచి గువాహటికి కూడా మరో సర్వీసును ప్రారంభించింది. ఈ రెండు సర్వీసులు అక్టోబరు పదో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ సందర్భంగా తొలి టికెట్‌ను స్పైస్‌జెట్ ప్రతినిధులు కేటీఆర్‌కు అందించారు. హైదరాబాద్-బ్యాంకాక్‌ టికెట్‌ను ప్రారంభ ఆఫర్ కింద రూ. 10,001కి అందిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్-గువాహటి టికెట్ ధరను రూ.4,286గా నిర్ణయించింది. కొత్త సర్వీసుల ద్వారా వినియోగదారులకు మరింత దగ్గర కాబోతున్నట్టు స్పైస్ జెట్ తెలిపింది.
Go Back to Shorts
spice jet
Hyderabad
Bangkok
Guwahati
Shamshabad

More Telugu News