చదువుకునే రోజుల్లోనే నలుగురు ప్రపోజ్ చేశారు: అను ఇమ్మాన్యుయేల్
- ‘తుప్పరివాలన్’తో తమిళ ప్రేక్షకులకు దగ్గరైన అను
- తమిళంలో వరుస అవకాశాలు
- ప్రేమ పెళ్లే చేసుకుంటానన్న అను
దీంతో ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ, అలాగే మరో రెండు సినిమాల్లోనూ కథానాయికగా ఈ చిన్నదే ఎంపికైంది. ఈ చిత్ర విశేషాల గురించి అలాగే తన వివాహం గురించి అను మాట్లాడుతూ, తమిళ సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకుని ప్రేక్షకుల మెప్పు పొందుతానని తెలిపింది. తనకు చదువుకునే రోజుల్లోనే నలుగురు ప్రపోజ్ చేశారని.. ప్రేమ అనేది ఇద్దరి హృదయాలను కలిపే అద్భుతమైన విషయం అని తెలిపింది. అంతేనా... పెళ్లంటూ చేసుకుంటే అది ప్రేమ పెళ్లేనని కూడా స్పష్టం చేసింది.