samanta: నాగేశ్వరరావు గారి కాంప్లిమెంట్ ను ఎప్పటికీ మరిచిపోలేను: సమంత

షార్ట్స్‌లో చూడండి
గ్లామర్ పరంగాను .. నటన పరంగాను సమంత తెలుగు .. తమిళ ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. సుదీర్ఘ కాలంగా ఆమె ఈ రెండు భాషల్లోను అగ్రకథానాయికగా కొనసాగుతున్నారు. అలాంటి సమంత తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడారు. "అక్కినేని నాగేశ్వరరావుగారిని ఫస్టు టైమ్ 'మనం' సినిమా సమయంలో చూడటమేనా? అంతకుముందు ఎప్పుడైనా ఎక్కడైనా ఆయనను కలిశారా?' అనే ప్రశ్న సమంతకు ఎదురైంది.

అందుకు ఆమె స్పందిస్తూ .. 'ఏ మాయ చేశావే' 50 డేస్ ఫంక్షన్లో నాగేశ్వరరావుగారిని కలిశాను. సాధారణంగా నేను ఎవరి కాంప్లిమెంట్స్ ను ఎక్కువగా పట్టించుకోను. నెక్స్ట్ ఏం చేయాలి అనే విషయంపైనే దృష్టిపెడతాను. కానీ నాగేశ్వరరావుగారు ఇచ్చిన కాంప్లిమెంట్ ను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ సినిమాలో నటన పరంగా 50 మార్కులకిగాను చైతూకి 49 ఇస్తున్నట్టుగా ఆయన చెప్పారు. నాకు మాత్రం 51 మార్కులను ఇస్తున్నట్టుగా చెప్పారు. ఆయనిచ్చిన ఈ కాంప్లిమెంట్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది" అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
samanta

More Telugu News