అల్లు అర్జున్ అంతే .. దేన్నీ లెక్కచేయడు: బన్నీవాసు

  • ఆ రోజు ఉదయమే సర్జరీ జరిగింది 
  • సాయంత్రానికి బెంగుళూర్ వెళదామన్నాడు 
  • ఎంతగా చెప్పినా వినిపించుకోలేదు 
నిర్మాత బన్నీవాసుకి .. అల్లు అర్జున్ కి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. సినిమా వేదికలపై ఈ విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ గురించి బన్నీవాసు ప్రస్తావించాడు. "నేను .. అల్లు అర్జున్ మంచి స్నేహితులమే అయినప్పటికీ మా ఇద్దరి ఆలోచనా విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. నిదానమే ప్రధానమన్నట్టుగా నేను వుంటాను .. ఏదేమైనా దూకేద్దాం అన్నట్టుగా అల్లు అర్జున్  ఉంటాడు.

'గంగోత్రి' సినిమా సమయంలో .. మర్నాడు ఉదయం షూటింగ్ అనగా ఆ రోజు ఉదయం అల్లు అర్జున్ 'టాన్సిల్స్ సర్జరీ' చేయించుకున్నాడు. ఎంతమాత్రం రెస్ట్ తీసుకోకుండా, ఆ సాయంత్రమే బెంగుళూర్ వెళ్లి సినిమాకి కావలసిన తన కాస్ట్యూమ్స్ తెచ్చుకుందామని అన్నాడు. ఒకమాట ఇంట్లో చెప్పి వెళదామని అన్నాగాని వినిపించుకోలేదు. సినిమా పట్ల ఆయనకి గల అంకితభావం అలాంటిది .. ఆ విషయంలో ఆయన దేన్నీ లెక్కచేయడు" అని చెప్పుకొచ్చాడు.      
Go Back to Shorts
Allu Arjun
bunny vasu

More Telugu News