ప్రణయ్ హత్య కేసులో మరో మలుపు... నల్గొండ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరీమ్ అరెస్ట్!
- ఉదయం నుంచి కరీమ్ ను ప్రశ్నిస్తున్న పోలీసులు
- సుపారీ మాట్లాడటం, హంతకుల ఏర్పాటు కరీమ్ ఆధ్వర్యంలోనే
- కేసును మరింత లోతుగా విచారిస్తున్నామన్న పోలీసులు
ఈ మేరకు కరీమ్ ను ఉదయం నుంచి పోలీసులు విచారిస్తున్నారు. అల్లుడిని హత్య చేయాలని మారుతీరావు నిర్ణయించుకున్న తరువాత, మిగతా కథంతా కరీమ్ నడిపించినట్టు తెలుస్తోంది. సుపారీ మాట్లాడటం నుంచి హంతకుల ఏర్పాటు వరకూ ఇతని పర్యవేక్షణలోనే జరిగినట్టు సమాచారం. కాగా, ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నామని, నేడో, రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని పోలీసు అధికారులు వెల్లడించారు.