ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతున్నారు: ఆది పినిశెట్టి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతున్నారు: ఆది పినిశెట్టి

  • నిన్ననే విడుదలైన 'యూటర్న్'
  • తొలిరోజునే పాజిటివ్ టాక్ 
  • కన్నడ హిట్ మూవీకి రీమేక్  
సమంత .. ఆది పినిశెట్టి .. రాహుల్ రవీంద్రన్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'యూటర్న్' .. నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2016లో కన్నడలో వచ్చిన థ్రిల్లర్ మూవీకి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను అదే పేరుతో .. అదే దర్శకుడితో తెలుగులో తెరకెక్కించారు. తొలిరోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా ఆది పినిశెట్టి మాట్లాడుతూ .. "వాస్తవానికి దగ్గరగా ఈ సినిమా రూపొందింది .. నటీనటులు కాకుండా తెరపై పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అందువల్లనే పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా, మౌత్ టాక్ తో థియేటర్ల దగ్గర సందడి పెరుగుతోంది. సినిమా చూసిన వాళ్లంతా థ్రిల్ ఫీలవుతున్నారు. ఈ సినిమాలో నా ఎంట్రీ .. అది కొనసాగిన తీరు నాకు బాగా నచ్చాయి. ఇంతటి వైవిధ్యభరితమైన పాత్ర నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.  
samanta
adipinishrtty
rahul

More Telugu News