అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ దాతృత్వం.. ఇళ్లు లేని కుటుంబాల కోసం 2 బిలియన్ డాలర్ల నిధి!
- పెద్ద మనసు చాటుకున్న అపర కుబేరుడు
- ఇళ్లు, ప్రీ స్కూళ్ల నిర్మాణానికి 2 బిలియన్ డాలర్లతో నిధి
- తర్వాతి తరం పిల్లలకు దుర్భర జీవితాలు వద్దనే
ఈ-కామర్స్ సంస్థ అయిన అమెజాన్‌ను 5 జూలై 1994లో బెజోస్ స్థాపించారు. ఆన్‌లైన్ వ్యాపార రంగంలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ నికర విలువ ప్రస్తుతం 163 బిలియన్ డాలర్లు. సేవ చేయాలన్న నిర్ణయాన్ని గతేడాదే తీసుకున్నానని, ఇందుకోసం పలువురి నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకున్నట్టు బెజోస్ ఈ సందర్భంగా తెలిపారు. మన తాత ముత్తాలతో పోలిస్తే మన జీవితాలు మెరుగ్గా ఉన్నాయన్న ఆయన ఇప్పుడు మనమేదైనా చేయకపోతే మన తర్వాతి తరం పిల్లలు కూడా మళ్లీ అదే జీవితాన్ని అనుభవించాల్సి ఉంటుందన్నారు. మంచిని ప్రపంచమంతా పంచిపెట్టాలని బెజోస్ పేర్కొన్నారు.