ఏడు మండలాల పునర్విభజనపై మీ వైఖరి ఏంటి?: ఈసీ, తెలుగు రాష్ట్రాలను ప్రశ్నించిన హైకోర్టు
- ఎన్నికలు ఆపాలని కాంగ్రెస్ పిటిషన్
- పునర్విభజన తర్వాత జరపాలని విజ్ఞప్తి
- కేంద్రం, ఈసీకి ధర్మాసనం నోటీసులు
ఈ 7 మండలాలను ఏపీలో కలుపుతున్నట్లు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ మాత్రమే జారీ చేసిందనీ, నియోజకవర్గాల వారీగా పునర్విభజన చేయలేదని కోర్టుకు తెలిపారు. ఈ మండలాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యాకే తెలంగాణలో ఎన్నికలు జరిపించాలన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని తెలిపారు.
వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్ , జస్టిస్ వి.సుబ్రమణియన్ ల ధర్మాసనం.. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఏపీ, తెలంగాణలకు నోటీసులు జారీచేసింది. అంతేకాకుండా ఈ విషయంలో తమ వైఖరి ఏంటో తెలియజేయాలని ఈసీ కార్యదర్శి, కేంద్ర న్యాయ, హోంశాఖ కార్యదర్శులు, తెలుగు రాష్ట్రాల సీఎస్ లను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.