చంద్రబాబుకు చేతకాకపోతే నాకు అధికారమిస్తే ఇసుక మాఫియాను అరికడతా: విష్ణుకుమార్ రాజు

  • ఇసుక మాఫియా అరాచకాలు పెరిగిపోతున్నాయి
  • టీడీపీ మిత్ర పక్షంగా ఉన్నప్పుడూ నేను విమర్శించా
  • విలేకరులతో విష్ణుకుమార్ రాజు
సీఎం చంద్రబాబుకు చేతకాకపోతే కనుక తనకు అధికారమివ్వాలని, ఏపీలో ఇసుక మాఫియాను నెలరోజుల్లో అరికడతానని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సవాల్ విసిరారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీకి టీడీపీ మిత్ర పక్షంగా ఉన్నప్పటి నుంచి రాష్ట్రంలో ఇసుక మాఫియాను తాను వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో రోజురోజుకీ ఇసుక మాఫియా అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. కాగా, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు కావడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఎన్నికలలో కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం కోసమే  ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుందని ఆరోపించారు.
Go Back to Shorts
Chandrababu
vishnu kumar raju

More Telugu News