'గీత గోవిందం' వదులుకున్నందుకు బాధ పడుతున్నాను: అనూ ఇమ్మాన్యుయేల్
- 'గీత గోవిందం' కోసం నన్ను అడిగారు
- అప్పుడు బిజీగా వున్నాను
- అందువల్లనే ఒప్పుకోలేదు
తాజాగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా ప్రమోషన్స్ లో ఆమె మాట్లాడుతూ .. 'గీత గోవిందం' గురించి కూడా ప్రస్తావించింది. "ముందుగా ఈ సినిమాలో కథానాయికగా చేసే ఛాన్స్ నాకు వచ్చింది. అయితే అప్పటికే నేను 'నా పేరు సూర్య' సినిమాతో బిజీగా వున్నాను. ఇక 'శైలాజా రెడ్డి అల్లుడు' కూడా ఒప్పుకుని వున్నాను. అందువల్లనే 'గీత గోవిందం' చేయలేకపోయాను. ఈ సినిమాను నేను ఇంకా చూడలేదు .. కానీ ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధించిందనేది చూస్తూనే వున్నాను. ఈ సినిమా హిట్ అయినందుకు ఆనందంగా వుంది .. నేను చేయలేకపోయానే అనే బాధ కూడా వుంది" అని చెప్పుకొచ్చింది.