'శైలజా రెడ్డి అల్లుడు' కోసం వెయిట్ చేస్తున్నాను: అనూ ఇమ్మాన్యుయేల్
- రమ్యకృష్ణ కూతురుగా కనిపిస్తాను
- 'ఈగో'ను కలిగిన పాత్ర
- నాకు మంచి పేరు తీసుకొస్తుంది
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను రమ్యకృష్ణ కూతురుగా కనిపిస్తాను. ఒక రేంజ్ లో 'ఈగో'ను చూపిస్తూ వుంటాను. ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంది. అందువలన ఈ పాత్ర నాకు మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం వుంది. రమ్యకృష్ణ గారు గొప్ప నటి అని తెలుసు .. ఆమెతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఆమె ఒక్కసారి చూసుకునే చెప్పేయడం చూసి ఆశ్చర్యపోయాను. ఈ సినిమా విడుదల తేదీ ఎంత తొందరగా వస్తుందా అని మీ అందరికంటే ఎక్కువగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.