poona kaur: 'పీకే లవ్' హ్యాష్ ట్యాగ్.. నెటిజన్ల ఫైర్.. వీడియో విడుదల ఆపేసిన పూనం కౌర్!

షార్ట్స్‌లో చూడండి
సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ లో కూడా నటి పూనం కౌర్ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె గత కొంత కాలంగా సైలెంట్ గా ఉంది. తాజాగా, కృష్ణాష్టమి సందర్భంగా ఓ వీడియోను విడుదల చేయబోతున్నానని అంతకు ముందు రోజు ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఎంతో నిజాయతీగా, సంతోషంతో వీడియోను రూపొందించానని పేర్కొంది. దానికి 'పీకే లవ్' అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జత చేసింది.

అయితే, ఊహించని విధంగా పూనంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఆమె విడుదల చేయబోయే వీడియో పట్ల తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. దీంతో, పూర్తిగా ఆవేదనకు గురైన ఆమె... వీడియో విడుదలను ఆపేసింది. తాను ఎంతో నిజయతీగా ఉన్నా, తన తప్పు లేకపోయినా... తనను అనవసరంగా విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఎంతో ఇష్టపడి రూపొందించిన వీడియోను విడుదల చేయడం లేదని మరో ట్వీట్ ద్వారా తెలిపింది. 
Go Back to Shorts
poona kaur
pk love
tollywood

More Telugu News