తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జయిన బస్సులు!

  • సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై ఘటన
  • రాంగ్ రూట్లో వచ్చిన బస్సు
  • రోడ్డుపై స్తంభించిన ట్రాఫిక్
తమిళనాడులోని సేలంలో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో  ప్రయాణికులతో వస్తున్న ఓ బస్సు, ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టడంతో 8 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 37 మంది గాయపడ్డారు.

బెంగళూరు నుంచి సేలంకు ఓ బస్సు ఈ రోజు ఉదయం వస్తుండగా, సేలం నుంచి ధర్మపురికి రాంగ్ రూట్ లో వెళుతున్న బస్సు దీన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మహిళలు సహా 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం కారణంగా రెండు బస్సుల్లో గాయపడిన 37 మందిని అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదం నేపథ్యంలో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.

Go Back to Shorts
Road Accident
Tamilnadu
selam

More Telugu News