సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సాయిపల్లవి సినిమాలు ఒకే రోజున రెండు!
  • 'సైరా' కోసం జార్జియా వెళుతున్న చిరంజీవి 
  • గ్యాప్ తరువాత రాజ్ తరుణ్ చిత్రం 
*  అందాల నాయిక సాయిపల్లవి నటిస్తున్న రెండు సినిమాలు ఒకే రోజున విడుదలకు ముస్తాబవుతున్నాయి. శర్వానంద్ తో కలసి నటిస్తున్న 'పడి పడి లేచే మనసు', ధనుష్ తో కలసి నటిస్తున్న 'మారి 2' చిత్రం .. రెండూ డిసెంబర్ 21న విడుదల కానున్నాయి. సో, సాయిపల్లవి అభిమానులకు పండగే!
*  చిరంజీవి కథానాయకుడుగా నటిస్తున్న 'సైరా' చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగును త్వరలో జార్జియాలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను అక్కడ భారీ ఎత్తున చిత్రీకరిస్తారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
*  ఇటీవల వరుస పరాజయాలతో వెనుక పడ్డ యంగ్ హీరో రాజ్ తరుణ్ కాస్త విరామం తీసుకుని తాజాగా ఓ చిత్రాన్ని కమిట్ అయ్యాడు. నవీన్ మేడారం (బాబు బాగా బిజీ ఫేం) దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. 
Go Back to Shorts
Saipallavi
Chiranjivi
Rajtarun
Sharwanand

More Telugu News