హరికృష్ణ వెళ్లాల్సిన కావలి కల్యాణ మండపంలో పరిస్థితి ఇది!
- కావలిలోని బృందావన్ కల్యాణ మండపంలో వివాహం
- ఆ వివాహానికే బయలుదేరిన హరికృష్ణ
- హఠాన్మరణంతో పెళ్లింట విషాద ఛాయలు
ఈ వార్తను విన్న మోహన్ కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా, పెళ్లి మండపంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. పెళ్లికి వచ్చి తన కుమారుడిని ఆశీర్వదిస్తాడని భావించి, ఆయనకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వేళ, ఈ వార్త తెలిసిందని మోహన్ బోరున విలపించారు. పెళ్లికి వస్తాడనుకున్న మిత్రుడు హరికృష్ణ ఇక లేడని, శాశ్వతంగా కనిపించడన్న వార్త తనను కలచి వేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.