Pawan Kalyan: గాయాలు మాత్రమే అనుకున్నా... అంతలోనే ఇంత దుర్వార్తా?: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మరణంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ లేఖను పెడుతూ, నేటి జనసేన అధికారిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. హరికృష్ణ ప్రమాదానికి గురయ్యారని తెలియగానే గాయాలతో బయటపడతారని భావించానని, ఆ వెంటనే విషాద వార్త వినాల్సి వచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు.

 సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని వ్యాఖ్యానించిన పవన్, హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషాద సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్లే శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఇవ్వాలని, తన తరఫున, జనసేన శ్రేణుల తరఫున ఆయనకు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Harikrishna

More Telugu News