తెలంగాణలో ముందస్తు ఎన్నికలొస్తే మాకు సంబురమే: జైపాల్ రెడ్డి
- ప్రగతి భవన్ లో కూర్చొని కేసీఆర్ కలలు కంటున్నారు
- నాడు ‘ముందస్తు’కు వెళ్లిన చంద్రబాబుకు ఏమైంది?
- అదే గతి కేసీఆర్ కూ పడుతుంది
ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, ఎన్నికలను ఎదుర్కోవడానికి తమ కార్యకర్తలు రెడీగా ఉన్నారని చెప్పారు. ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోందన్న భయంతోనే ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలు చేస్తున్నారని, కేసీఆర్ పాలనపై ప్రజలు అసహనంతో ఉన్నారని విమర్శించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఏ గ్రామానికి నీరు రాలేదని.. గుత్తేదారులు, టీఆర్ఎస్ నేతలకు మాత్రం డబ్బులు వచ్చాయని, ప్రభుత్వ పథకాల అమలులో టీఆర్ఎస్ విఫలమైందని అన్నారు.