'శైలజా రెడ్డి అల్లుడు' నుంచి మనసును తాకే మెలోడీ
- మారుతి నుంచి 'శైలజా రెడ్డి అల్లుడు'
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
- వచ్చేనెల 13వ తేదీన విడుదల
"ఏ ఊరు .. ఏ దారి .. ఏ దూరమైనా .. నే రానా చేసేసి ఏ నేరమైనా .. గదులు ఆపేనా .. నదులు ఆపేనా .. నేను దాటేయనా .. చాటేయనా .. ప్రేమనీ .. " అంటూ ఈ మెలోడీ సాంగ్ సాగుతోంది. కృష్ణకాంత్ సాహిత్యానికి గోపీసుందర్ బాణీని సమకూర్చగా, సిద్ శ్రీరామ్ .. లిప్సిక ఆలపించారు. నాయకా నాయికలపై చిత్రీకరించిన ఈ పాట మధురంగా మనసును తాకుతూ, యూత్ ను కట్టిపడేసేలా వుంది. కొత్తగా .. మత్తుగా వినిపిస్తూ మంచి మార్కులు కొట్టేసేలా అనిపిస్తోంది.