బిగ్‌బాస్ నుంచి పూజా రామచంద్రన్ ఔట్.. హౌస్‌లో సందడి చేసిన నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్‌బాస్ నుంచి పూజా రామచంద్రన్ ఔట్.. హౌస్‌లో సందడి చేసిన నాని

  • హౌస్‌లో రాఖీ సెలబ్రేషన్స్
  • రాఖీలు, స్వీట్లతో హౌస్‌లో అడుగుపెట్టిన నాని
  • స్వయంగా వడ్డించిన నాని
బిగ్‌బాస్-2 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. గతవారం ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చిన వారిలో కౌశల్, తనీశ్, దీప్తి ప్రొటెక్టెడ్ జోన్‌లోకి వెళ్లిపోగా నటి పూజా రామచంద్రన్ ఎలిమినేట్ అయింది. పూజ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించగానే హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అనంతరం పూజ మాట్లాడుతూ.. ఎలిమినేట్ అయినందుకు తనకేమీ బాధగా లేదని పేర్కొంది. తాను బాగా ఎంజాయ్ చేశానని, ఆటను ఆటలాగే ఆడానని పేర్కొంది.

కాగా, రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఈసారి హౌస్‌లోకి ఓ స్పెషల్ గెస్ట్ వచ్చాడు. అతడు మరెవరో కాదు.. హోస్ట్ నాని. అతడిని చూసిన వెంటనే హౌస్ సభ్యులు ఒక్కసారిగా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. నాని వస్తూ వస్తూ తనతోపాటు స్వీట్లు, పోటీదారుల కుటుంబ సభ్యులు పంపించిన రాఖీలు, లెటర్లు మోసుకొచ్చాడు. దీంతో హౌస్‌ లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సామ్రాట్, కౌశల్, తనీశ్ తదితరులకు ఇంటి నుంచి వచ్చిన రాఖీలను దీప్తి, గీతామాధురి తదితరులు కట్టారు. దీంతో హౌస్ ఒక్కసారిగా సెలబ్రేషన్స్ మూడ్‌లోకి వెళ్లిపోయింది. కాగా, తాను తీసుకొచ్చిన స్వీట్లు, పాయసం తదితర వాటిని నాని స్వయంగా వడ్డించడం విశేషం.
Big Boss
Telugu
Star Maa
Nani
Puja Rama chandran
Actress

More Telugu News