సెప్టెంబర్ 2న దయచేసి ప్రయాణాలు పెట్టుకోవద్దు!: ప్రజలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
- సెప్టెంబర్ 2 ఆదివారం
- కావాలనే ఆరోజున సభ ఏర్పాటు చేశాం
- ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలను మేమే బుక్ చేసుకుంటాం
ఆ రోజున అందుబాటులో ఉన్న అన్ని వాహనాలను వినియోగించుకుంటాం. ప్రగతి నివేదన సభకు పెద్ద ఎత్తున ప్రజలు సురక్షితంగా తరలి రావాలంటే ఆ రోజున ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాలను పార్టీ పరంగా మేమే బుక్ చేసుకుంటాం. ప్రజలకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.. సెప్టెంబర్ 2 నాడు దయచేసి ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఈ ఒక్కరోజు జరిగే అసౌకర్యానికి ప్రజలు మన్నించి మాకు సహకరించాలని పార్టీ పరంగా విజ్ఞప్తి చేస్తున్నా’ అని కేటీఆర్ పేర్కొన్నారు.