అవును.. విద్యార్థులను పడుపు వృత్తిలోకి పంపేందుకు యత్నించా!: తమిళనాడు మహిళా ప్రొఫెసర్ అంగీకారం
- యువతులకు ఉద్యోగాల ఆశ చూపిన నిర్మల
- ఫోన్ సంభాషణలు వైరల్
- కోర్టుకు వాంగ్మూలం సమర్పించిన అధికారులు
దీంతో తమిళనాడులో ఒక్కసారిగా కలకలం రేగింది. గవర్నర్ పురోహిత్ అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి తనకు నిర్మలాదేవితో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆమెతో పాటు మధురై కామరాజార్ వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్, మాజీ పరిశోధక విద్యార్థి కరుప్పస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో కేసును విచారించిన సీబీసీఐడీ.. పక్కాగా ఆధారాలను సేకరించింది. ఈ సందర్భంగా జరిగిన విచారణలో నలుగురు యువతులను పడుపు వృత్తిలోకి నెట్టేందుకు ప్రయత్నించానని పోలీసుల ముందు నిర్మల ఒప్పుకుంది. దీంతో ఆమె వాంగ్మూలాన్ని, నివేదికను పోలీసులు మద్రాస్ హైకోర్టుకు సమర్పించారు.