చైనాలోని రిసార్ట్స్ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 18 మంది మృతి
- హోటల్ నాలుగో అంతస్తులో మంటలు ప్రారంభం
- 16 మంది ప్రాణాలు కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
- తెల్లవారు జామున 4.30 గంటలకు ఘటన
తొలుత నాలుగో అంతస్తులో ప్రారంభమైన మంటలు కాసేపటికి భవనం అంతటికీ వ్యాపించాయి. దీంతో 18 మంది సజీవ దహనం కాగా, 16 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించి ఆస్పత్రికి తరలించారు. 30 అగ్నిమాపక శకటాలతో సుమారు వంద మంది సిబ్బంది మూడుగంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.