అమితాబ్‌తో ‘ఆంఖే’ సీక్వెల్‌.. ముఖ్య పాత్రలో జాకీచాన్?
Add ap7am to your home Screen

అమితాబ్‌తో ‘ఆంఖే’ సీక్వెల్‌.. ముఖ్య పాత్రలో జాకీచాన్?

  • ఆంఖేలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన బిగ్‌ బీ
  • సీక్వెల్ కి సన్నాహాలు.. ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ 
  • ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్న హాలీవుడ్‌ స్టార్‌ జాకీచాన్‌
  • అనీన్‌ బజ్మీ దర్శకుడు
  •  
బాలీవుడ్‌ స్టార్‌ అమితాబచ్చన్‌, హాలీవుడ్‌ స్టార్‌ జాకీచాన్‌ కలిసి నటిస్తే ఎలా వుంటుంది... ఓహ్.. నయనానందం కదూ? త్వరలోనే అటువంటి అవకాశం ఉందంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. బిగ్‌ బీ ప్రతినాయకుడి పాత్ర పోషించగా 2002లో విడుదలైన ‘ఆంఖే’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రంలో అగ్ర కథానాయకుడు అమితాబ్‌ నటిస్తున్నారు. ఇదే చిత్రంలో ఇంటర్నేషనల్ స్టార్‌ జాకీచాన్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుతం ఈ విషయమై ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

 ఏరోస్ ‌ ఇంటర్నేషనల్‌ సంస్థ, తరుణ్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సీక్వెల్‌ చిత్రానికి అనీస్‌బజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతుండగా 2019లో సెట్స్‌పైకి వస్తుందని, 2020లో సినిమా విడుదలకు దర్శక నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. కాగా, ఇదే చిత్రంలో మరో రెండు ముఖ్య పాత్రల్లో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌, విక్కీకౌశల్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలపై చిత్రబృందం మాత్రం స్పందించడం లేదు. 
Amitabh Bachchan
Bollywood
Aankhen

More Telugu News