సిమ్ కావాలా? అయితే.. ఇకపై ఈ రెండూ తప్పనిసరి.. అమల్లోకి కొత్త నిబంధనలు!
- సిమ్‌ల జారీలో ఇకపై కొత్త నిబంధనలు
- సెప్టెంబరు 15 నుంచి దశల వారీగా అమలు
- ఆదేశాలు జారీ చేసిన ఆధార్
ప్రస్తుతం టెలికం సంస్థలు కొత్త సిమ్ కార్డు జారీలో వేలిముద్ర, ఓటీపీ, ఐరిస్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. తాజా నిబంధనల ప్రకారం ఇకపై ఫేషియల్ రికగ్నిషన్, లైవ్‌ఫొటో కూడా తీసుకోనున్నారు. వర్చువల్ ఆధార్ కార్డు (వీఐడీ) ఇస్తే కనుక వేలిముద్ర, లేదంటే ఐరిస్ ధ్రువీకరణ సరిపోతుంది. వయసు, ఇతర కారణాల వల్ల వేలిముద్ర, ఐరిస్ తీసుకోలేకపోయిన సందర్భాల్లో ఫేషియల్ రికగ్నిషన్ ఆధారంగా ధ్రువీకరించాలని యూఐడీఏఐ ఆదేశాల్లో స్పష్టం చేసింది.