‘ముందస్తు’ హడావిడి అంతా కేసీఆర్ గిమ్మిక్కే: బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో ముందస్తు ఎన్నికలంటూ సీఎం కేసీఆర్ చేస్తున్న హడావిడి అంతా గిమ్మిక్కేనని, ముందస్తు ఎన్నికలు రానే రావని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ఒక్కటైనా అమలు చేశారా? ఉస్మానియాకు రూ.200 కోట్లు ఇస్తునట్టు జీవో ఇచ్చారు కానీ, కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు. ఎన్నికలు సమీపించే తరుణంలో కేంద్రాన్ని తిట్టడం కేసీఆర్ కు అలవాటైపోయిందని, కేంద్రం నుంచి అన్నీ తెచ్చుకుని బీజేపీపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో బీజేపీ కలిసే ప్రసక్తే లేదని శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.
Go Back to Shorts
TRS
bjp
sridhar reddy

More Telugu News