కోలీవుడ్ లో లక్కీ ఛాన్స్ కొట్టేసిన రెజీనా

  • కోలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న రెజీనా
  • అరవిందస్వామికి జోడీగా ఛాన్స్ కొట్టేసిన రెజీనా
  • వరుస సినిమాలతో జోరుమీదున్న అరవిందస్వామి
టాలీవుడ్ లో అవకాశాలు తగ్గినా, కోలీవుడ్ లో మాత్రం అందాల భామ రెజీనా కసాండ్రా అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా ఆమె మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తమిళంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో అరవిందస్వామికి జోడీగా రెజీనాను ఎంపిక చేశారు. వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. షూటింగ్ మొత్తం చెన్నైలోనే జరగనుంది.

 'ఎన్నమో నడక్కుదు', 'అచ్చమిండ్రి' సినిమాల ఫేమ్ రాజపాండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరోవైపు, సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అరవిందస్వామి వరుస సినిమాలతో మాంచి జోరుమీదున్నాడు. అరవింద్ నటించిన 'నరకసూరన్', 'చదురంగవేట్టై' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Go Back to Shorts
regina cassandra
aravinda swamy
kollywood
tollywood

More Telugu News