పాము కరిచిందని ఆసుపత్రికి వెళితే... బతికుండగానే శవపరీక్షకు పంపారు... హన్మకొండ వైద్యుల నిర్వాకం!
- 19వ తేదీన కరిచిన పాము
- బాలిక చనిపోయిందన్న ప్రైవేటు వైద్యులు
- బతికుందని గుర్తించి చికిత్స చేసిన ఎంజీఎం డాక్టర్లు
- నిన్న సాయంత్రం మరణించిన బాలిక
వెంటనే ముల్కనూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి రిషితను తీసుకెళ్లి, ఆపై మెరుగైన వైద్యం కోసం వరంగల్ లోని ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో, హన్మకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు బాలిక మరణించిందని చెప్పడంతో విలవిల్లాడిపోయారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించడంతో, పోస్టుమార్టం వేళ, పాప ఇంకా బతికే ఉందని గుర్తించిన వైద్యులు, అత్యవసర చికిత్స చేసినప్పటికీ, ఫలించలేదు. అప్పటికే విషం శరీరమంతా వ్యాపించగా, నిన్న సాయంత్రం బాలిక మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మల్కనూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు.