kcr: టీ-మంత్రులతో సీఎం కేసీఆర్ రేపు అత్యవసర సమావేశం?

షార్ట్స్‌లో చూడండి
సీఎం కేసీఆర్ రేపు తెలంగాణ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రులను ఆదేశించినట్టు సమాచారం. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం.

రేపు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఈ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారని, పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. ఈ వారం చివరిలోనే పార్లమెంటరీ, ఎల్పీ సమావేశం జరగనుందని, అలాగే, వచ్చే నెల 4న హైదరాబాద్ శివారులో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
kcr
Telangana

More Telugu News