తమిళంలో శ్రీరెడ్డి బయోపిక్.. వివరాల వెల్లడి!
- సినిమా వివరాలు వెల్లడించిన శ్రీరెడ్డి
- చిత్రం పేరును ‘రెడ్డి డైరీ’గా నిర్ణయించినట్లు వెల్లడి
- మోసం చేసినవారి వీడియోలను సినిమాలో పెడతానని వ్యాఖ్య
తనను మోసగించినవారికి సంబంధించిన వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని శ్రీరెడ్డి చెప్పింది. సరైన సమయం వచ్చినప్పుడు అన్నింటిని బయటపెడతానని హెచ్చరించింది. తాను నటించనున్న ‘రెడ్డి డైరీ’ సినిమాకు సహకరిస్తామని నడిగర్ సంగం హామీ ఇచ్చిందని శ్రీరెడ్డి తెలిపింది. తనను మోసం చేసిన వ్యక్తులకు సంబంధించి తనవద్ద ఉన్న వీడియోలను ఈ సినిమాలో చూపెడతానని ఆమె చెప్పింది.