తెలంగాణలో అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తుల దాడి..ఫారెస్ట్ రేంజర్ కు గాయాలు!
- క్షీణించిన అడవుల పునరుద్ధరణ కార్యక్రమం
- కొత్తగూడ అటవీ ప్రాంతానికి వెళ్లిన సిబ్బంది
- ఆ భూముల్లో వ్యవసాయం చేస్తున్నామన్న స్థానికులు
- మొక్కలు నాటొద్దంటూ సిబ్బందిపై దాడి
తెలంగాణలోని అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్థులు దాడి చేశారు. ఈ సంఘటనలో ఫారెస్ట్ రేంజర్ కు గాయాలయ్యాయి. క్షీణించిన అడవుల పునరుద్ధరణ నిమిత్తం అటవీ శాఖ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అటవీశాఖ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు వెళ్లిన సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు.
అటవీ భూముల్లో తాము వ్యవసాయం చేస్తున్నామని, మొక్కలు నాటేందుకు వీలు లేదంటూ విధుల్లో ఉన్న అటవీశాఖ సిబ్బందిని అడ్డగించారు. కర్రలతో దాడి చేయడంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలపతిరావుకు గాయాలయ్యాయి. ఈ ఘటనను జిల్లా ఎస్పీ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.