అవకాశాల కోసం వాళ్లే వెళుతున్నారు.. క్యాస్టింగ్ కౌచ్ పై డిస్కో శాంతి స్పందన!
- మహిళలను ఎవరూ బలవంతం చేయరు
- అవకాశాల కోసం కొందరు వారంతట వారే వెళతారు
- నాతో ఎవరైనా అలా ప్రవర్తిస్తే చంపేస్తా
క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ప్రతి చోటా ఉంటాయని శాంతి చెప్పారు. అయితే ఎవరూ కూడా మహిళలను బలవంతం చేయరని... అలా చేస్తే జైలుకు వెళతామనే భయం అందర్లో ఉంటుందని చెప్పారు. అవకాశాల కోసం కొందరు వారంతట వారే వెళుతున్నారని... ఆ తర్వాత మీడియాలో పబ్లిసిటీ కోసం ఆ విషయాలను చెప్పుకుంటుంటారని తెలిపారు.
మగవాడు పిలిచిననప్పుడే చెంప పగులకొడితే... అసలు ఇబ్బందే లేదు కదా? అని అన్నారు. తనవరకైతే అలాంటి అనుభవం ఎదురు కాలేదని... తనను చూస్తేనే అందరూ భయపడతారని తెలిపారు. ఎవరైనా తనతో అలా ప్రవర్తిస్తే చంపేస్తానని చెప్పారు. తనతో ఎవరూ మాట్లాడనే మాట్లాడరని, తన నోటి నుంచి ముందు బూతులే వస్తాయని అన్నారు.