Chandrababu: భారత రాజకీయ భీష్ముడు వాజ్ పేయి: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
భారత మాజీ ప్రధాని వాజ్ పేయి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన సంతాపం తెలిపారు. భారత రాజకీయ భీష్ముడు వాజ్ పేయి అని, గొప్ప రాజనీతిజ్ఞుడిని దేశం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంత కర్త, వక్త, అత్యుత్తమ పార్లమెంటేరియన్, ఒక్క ఓటుతో ప్రభుత్వం ఓడిపోయినా చలించని మేరునగధీరుడు వాజ్ పేయి అని కొనియాడారు. కాగా, వాజ్ పేయి మృతిపై ఏపీ మంత్రులు తమ సంతాపం తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
vajpayee

More Telugu News