parasuram: 'గీత గోవిందం' దర్శకుడి తదుపరి సినిమా ఖరారు

షార్ట్స్‌లో చూడండి
మంచు విష్ణు మొదటి నుంచి కూడా కామెడీకి ప్రాధాన్యతనిస్తూ .. యాక్షన్ ఎంటర్ టైనర్లు చేస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన 'ఆచారి అమెరికా యాత్ర' ఆడియన్స్ ను నిరాశ పరిచింది. దాంతో తన తదుపరి చిత్రమైన 'ఓటర్'పై విష్ణు దృష్టి పెట్టాడు. ఈ సినిమా తరువాత ఆయన 'కన్నప్ప' సినిమా చేయనున్నట్టు వార్తలు జోరుగా వినిపించాయి. కానీ అంతకంటే ముందుగా ఆయన మరొక సినిమా చేయనున్నట్టు సమాచారం.ఈ సినిమాకి దర్శకుడు ఎవరో కాదు .. పరశురామ్. ఆయన తెరకెక్కించిన 'గీత గోవిందం' నిన్ననే థియేటర్స్ కి వచ్చింది. తొలి రోజునే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దాంతో చాలా మంది యువ హీరోలు పరశురామ్ దర్శకత్వంలో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. కానీ ముందుగా ఆయన మంచు విష్ణుతో చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై పరశురామ్ కసరత్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.    
Go Back to Shorts
parasuram

More Telugu News