ఉగ్రవాదులతో లింక్ ఉన్నవారే ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు!: ప్రధాని మోదీ సంచలన ఆరోపణ
- పక్కా ఆధారాలు ఉన్నాయన్న ప్రధాని
- ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్ళ
- తమిళనాడులో ప్రత్యామ్నాయంగా మారతామని స్పష్టీకరణ
తమిళ పత్రిక ‘డైలీ తంతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పలు అంశాలపై స్పందించారు. ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తులే మౌలిక ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని మోదీ స్పష్టం చేశారు. ఇందుకు తమవద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ప్రకటించారు. ఈ శక్తులు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించి లబ్ధి పొందాలని చూస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు.
2014 లోక్ సభ ఎన్నికల సందర్భంగా డీఎంకే, అన్నాడీఎంకే మద్దతు లేకుండానే తమిళనాడులో బీజేపీ ఓ లోక్ సభ స్థానాన్ని దక్కించుకుందని మోదీ అన్నారు. బీజేపీకి తమిళనాడులో సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.