నాన్న చెప్పిన మాటను ఎప్పటికీ మరచిపోను: బ్రహ్మానందం తనయుడు
- ఫణీంద్ర వచ్చి కథ వినిపించాడు
- నాతోనే చేస్తానని పట్టుబట్టాడు
- నా కెరియర్లో నిలిచిపోయే మూవీ అవుతుంది
ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ .. "వైవిధ్య భరితమైన కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఫణీంద్ర ఈ సినిమా కథను నాకు చెప్పినప్పుడు .. నేనే చేయాలని అన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో చేయడమే అదృష్టంగా భావించాను. ఏ పని చేసినా అంకితభావంతో రక్త మాంసాలు ధారపోయాలని నాన్న నాకు చెప్పాడు. ఈ ప్రాజెక్టు విషయంలో ఆ మాటకి నేను పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నాను. ఆయన చెప్పిన ఈ మాటను నేను ఎప్పటికీ మరచిపోను. ఈ సినిమా నాకు తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది .. నా కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుంది" అని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.