సారంగపూర్ జైలుకు సంజయ్ తరలింపు!

  • నిన్న డీఎస్ కుమారుడు సంజయ్ అరెస్ట్
  • 24 వరకూ రిమాండ్ విధించిన న్యాయమూర్తి
  • నేడు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్న పోలీసులు
శాంకరీ నర్సింగ్ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థినులను లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) కుమారుడు సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేయగా, న్యాయస్థానం 24 వరకూ రిమాండ్ విధించింది. నిన్న ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు, జిల్లా న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లి ప్రవేశపెట్టారు.

ఆపై ఆయన రిమాండ్ విధించడంతో, వైద్య పరీక్షల అనంతరం సారంగపూర్ జైలుకు తరలించారు. సంజయ్ ని కనీసం వారం రోజుల కస్టడీ కోరనున్నామని, ఇందుకోసం నేడు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కేసులో సంజయ్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సివుందని అన్నారు. 
Go Back to Shorts
DS
Sanjay
Sexual Harrasment

More Telugu News