అంబులెన్స్ లో కరుణ భౌతికకాయం తరలింపు

  • గోపాలపురంలోని నివాసానికి వెళ్లనున్న అంబులెన్స్
  • నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • అభిమానుల రోదనలు
చెన్నైలోని కావేరి ఆసుపత్రి నుంచి గోపాలపురంలోని నివాసానికి కరుణానిధి భౌతికకాయాన్ని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. భౌతికకాయం వెంట కరుణానిధి కుటుంబసభ్యులు, సన్నిహితులు ఉన్నట్టు సమాచారం. కావేరి ఆసుపత్రి వద్ద, గోపాలపురంలోని నివాసం వద్దకు డీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. తమ అభిమాన నేత కరుణానిధి మృతిని జీర్ణించుకోలేని అభిమానుల రోదనలు మిన్నంటున్నాయి.

కాగా, అన్నాదురై సమాధి వద్దే కరుణానిధిని ఖననం చేస్తామన్న ఆయన కుటుంబసభ్యులు, డీఎంకే నేతల విఙ్ఞప్తిపై తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదు. న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని చెప్పడంపై డీఎంకే నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టును ఆశ్రయించేందుకు డీఎంకే నేతలు సిద్ధపడుతున్నట్టు సమాచారం. 
Go Back to Shorts
karunanidhi
chennai

More Telugu News