ఓటమిలోనూ కోహ్లీ రికార్డు!
- తొలి టెస్టులో ఓడిన టీమిండియా
- బ్రియాన్ లారా రికార్డును సమయం చేసిన కోహ్లీ
- సెంచరీలు చేసిన ఐదు మ్యాచుల్లోనూ ఓటమి
ప్రతిష్ఠాత్మక తొలి టెస్టులో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ స్కిప్పర్ కోహ్లీ ఖాతాలో మాత్రం అరుదైన రికార్డు వచ్చి చేరింది. భారత్ ఓడిపోయిన టెస్టు మ్యాచుల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా సరికొత్త రికార్డును కోహ్లీ సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా కోహ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సెంచరీలు చేసిన ఐదు టెస్టుల్లో టీమిండియా ఓటమి పాలైంది.
విండీస్ దిగ్గజ ఆటగాడు బ్రయాన్ లారా ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో అతడు సెంచరీలు చేసిన ఐదు మ్యాచుల్లోనూ జట్టు ఓటమి పాలైంది. ఇప్పుడా రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ వా 4 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.