యాచకురాలి పాడె మోసిన ఎమ్మెల్యే!

  • ఒడిశాలో ఘటన
  • మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ రాని వైనం
  • విషయం తెలుసుకుని మానవత్వం చూపిన ఎమ్మెల్యే
యాచక వృత్తిలో ఉండి, ఎవరూ లేని అనాధ మరణిస్తే, విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్యే తనలోని మానవత్వాన్ని చూపుతూ, అంత్యక్రియలు జరిపించడమే కాకుండా, స్వయంగా పాడెను మోశారు. ఈ ఘటన ఒడిశాలోని సంబన్ పూర్ జిల్లా అమనపాలి గ్రామంలో జరిగింది. గ్రామంలోని యాచకురాలు మరణించి, 24 గంటలు గడిచినా, మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ రాలేదు. ఆ విషయం స్థానిక ఎమ్మెల్యే రమేష్ పత్వాకు తెలిసింది.

 వెంటనే ఆయన తన కుమారుడు అంకిత్, అల్లుడు బాదల్ లను పిలిచి, ఆ గ్రామానికి వెళ్లి అంత్యక్రియలకు ఏర్పాటు చేయాలని సూచించాడు. ఆపై తన స్నేహితులతో కలసి అక్కడికి వెళ్లి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. చాలా ఏళ్ల నుంచి ఆ గ్రామంలో యాచకురాలు ఉందని, అక్కడే అడుక్కునే ఆమె తనకు తెలుసునని ఈ సందర్భంగా రమేష్ పత్వా వ్యాఖ్యానించారు. ఆమెకు అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని తెలిసి బాధ కలిగిందని చెప్పారు. మృతదేహాన్ని ముట్టుకుంటే కుల బహిష్కరణ చేస్తారేమోనని ప్రజలు భయపడ్డారని అన్నారు.
Go Back to Shorts
Odisha
Begger
Ramesh patwa

More Telugu News