నేడు జీఎస్టీ కౌన్సిల్ 29వ సమావేశం.. గుడ్ న్యూస్ వినిపించే అవకాశం!
- ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో సమావేశం
- పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం
- జీఎస్టీ పరిధిలోకి పెట్రోలు, డీజిల్
చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై ప్రభావం చూపే వాటిపైనా జీఎస్టీ తగ్గించే అవకాశం గురించి కూడా సమావేశంలో చర్చించనున్నారు. అలాగే జీఎస్టీని మరింత సరళతరం చేయడంపైనా దృష్టి సారించనున్నారు. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న ట్రాక్టర్లు, ట్రాక్టర్ విడిభాగాలు, ఎగ్ ట్రేలు, మూవీ టికెట్లు, పాత్రలు, తక్షణం లభ్యమయ్యే ఆహారం, బ్రేక్‌ఫాస్ట్‌కు అవసరమైన వాటిపై జీఎస్టీని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి వీటిపైనా కౌన్సిల్ చర్చించే అవకాశం ఉంది.