ఆలయంలో 'అరవింద సమేత వీర రాఘవ'
- డిఫరెంట్ లుక్స్ తో ఎన్టీఆర్
- ఈ నెలలోనే టీజర్ రిలీజ్
- వచ్చేనెలలో ట్రైలర్
ఈ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా వుంటాయని అంటున్నారు. ఎన్టీఆర్ .. పూజా హెగ్డే .. ఈషా రెబ్బా తదితరులు షూటింగులో పాల్గొంటున్నారు. రాయలసీమ నేపథ్యంలో కొనసాగనున్న ఈ కథలో ఎన్టీఆర్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ .. రాయలసీమ యాస ప్రత్యేక ఆకర్షణ కాగలవని అంటున్నారు. ఈ నెల రెండవ వారంలో టీజర్ ను .. వచ్చేనెలలో ట్రైలర్ ను వదలాలనే ఆలోచనలో వున్నారు. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.