మోదీ, అమిత్ షాలతో కృష్ణంరాజు భేటీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోదీ, అమిత్ షాలతో కృష్ణంరాజు భేటీ!

  • ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ
  • వచ్చే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాల ప్రస్తావన
  • కీలక నివేదికలు అందజేసిన కృష్ణంరాజు
ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు ఈరోజు కలిశారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు వచ్చే ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో కృష్ణంరాజు చర్చించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కీలక నివేదికలను వారికి అందించినట్టు సమాచారం. ఏపీలో వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలపై కూడా ఓ నివేదికను  కృష్ణంరాజు వారికి అందజేసినట్టు తెలుస్తోంది.  
modi
amit shah
krishnam raju

More Telugu News