geetanjali: విలన్ పాత్రలకి మా అబ్బాయి బాగా సరిపోతాడు: సీనియర్ నటి గీతాంజలి

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై చురుకైన పాత్రలతో సందడి చేసిన నటీమణులలో గీతాంజలి ఒకరు. ఆమె భర్త హీరో రామకృష్ణ అనే సంగతి తెలిసిందే. చిత్రపరిశ్రమలోను .. ప్రేక్షక లోకంలోనూ ఈ ఇద్దరికీ మంచి పేరుంది. అయితే ఆ ఫ్యామిలీ నుంచి వారసుడు రాకపోవడం అభిమానులకు నిరాశను కలిగించే విషయం. ఇదే విషయానికి సంబంధించిన ప్రశ్న ఆమెకి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఎదురైంది.

అప్పుడు గీతాంజలి స్పందిస్తూ .. "మా అబ్బాయి పేరు శ్రీనివాస్ .. మంచి హైటూ .. పర్సనాలిటీ ఉంటాడు. తనకి కూడా నటన అంటే ఇష్టమే. రామకృష్ణగారికి కూడా శ్రీనివాస్ ను సినిమా ఫీల్డ్ లోకి తీసుకురావాలని వుండేది. కానీ అంతకంటే ఎక్కువగా ఆయన అబ్బాయి చదువు మీదే దృష్టి పెట్టారు. ఇంకా నేను ఎవరికీ మా అబ్బాయిని చూపించలేదు. ఇప్పటి యంగ్ హీరోలకి విలన్ గా కరెక్ట్ గా సరిపోతాడు. చిరంజీవి గారు ఒక ఫంక్షన్ లో మా అబ్బాయిని చూసి 'చాలా బాగున్నాడు .. విలన్ గా వేయించేద్దాం' అన్నారు. త్వరలో మంచి అవకాశాలు వస్తాయనే అనుకుంటున్నాను" అని అన్నారు.  
Go Back to Shorts
geetanjali
ramakrishna

More Telugu News