మందుకొట్టి ఆర్టీసీ బస్సును అపహరించిన విద్యార్థి.. ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు!
- కాలేజీ నుంచి ఇంటికొస్తూ మందు కొట్టిన విద్యార్థి
- గ్రామంలోని ఆర్టీసీ బస్సు అపహరణ
- నియంత్రణ కోల్పోయి ప్రమాదం
బస్సును నడుపుకుంటూ వెళ్లిన ప్రవీణ్ రాజ్‌పురా భైన్ గ్రామానికి చేరుకునే సరికి నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టాడు. బస్సులో ఇరుక్కుపోయిన ప్రవీణ్‌ను బయటకు లాగేందుకు గ్రామస్తులకు మూడు గంటలు పట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
బస్సు చోరీకి గురైందని తెలుసుకున్న హిసార్ యూనిట్ వర్క్ మేనేజర్ జితేందర్ యాదవ్ వెంటనే మిర్చ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు బస్సును నిర్లక్ష్యంగా వదిలి వెళ్లిన డ్రైవర్, కండక్టర్‌పై డిపార్ట్మెంటల్ దర్యాప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి.